వైయస్ జగన్ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. అలాంటి వ్యవస్థను చంద్రబాబు నాశనం చేశారు అని మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. అయన మాట్లాడుతూ.... కనీసం ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు కూడా ఇవ్వడం లేదు. జగన్ అభివృద్ధి చేసిన స్కూళ్లను చూసి పవన్ కళ్యాణ్ సైతం ఆశ్చర్యపోయారు. ప్రైవేట్ స్కూల్కు పోటీగా ప్రభుత్వ స్కూల్ ఉందని మెచ్చుకున్నారు.