ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అమలుచేయాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jan 30, 2025, 07:51 PM

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం అమరావతిలో స్టేట్ ఇన్వెస్టిమెంట్ ప్రమోషన్ బోర్డ్  3వ సమావేశం జరుగుతోంది. ఈ భేటీలో ప్రధానంగా 15 ప్రాజెక్టులకు సంబందించి పెట్టుబడులకు ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకోనున్నారు. రూ. 44,776 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఈ సమావేశంలో ఆమోదం తెలుపనున్నారు. ఈ పెట్టుబడుల ద్వారా దాదాపు 20 వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకావముంది. గత రెండు సమావేశాల్లో ఆమోదం పొందిన ప్రాజెక్టుల స్థితిగతులపైనా ఈ రోజు చర్చ జరుగుతోంది. ఒప్పందాలపై పరిశ్రమల యాజమాన్యాలతో నిరంతర చర్చల ద్వారా సాధ్యమైనంత త్వరగా ప్రాజెక్టులు గ్రౌండ్ అయ్యేలా చూడాలని సిఎం సిఎం చంద్రబాబు సూచించారు. అధికారులు, మంత్రులు పెట్టుబడులను ట్రాక్ చేయడం ద్వారా త్వరితగతిన ఫలితాలు చూపించాలన్నారు. తీవ్రమైన పోటీ నెలకొన్న నేటి పరిస్థితుల్లో ఫలితాలు రావాలంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అమలు చేసి చూపాలని మంత్రులకు చంద్రబాబు సూచించారు. రాష్ట్ర స్థాయిలో అనుమతులు, క్షేత్ర స్ధాయిలో పనులపై కలెక్టర్లతో సమీక్ష చేయాలని ప్రధాన కార్యదర్శికి ముఖ్యమంత్రి ఆదేశించారు. పెట్టుబడులపై దిగ్గజ సంస్థల నుంచి, జాతీయ, అంతర్జాతీయ పారిశ్రామిక వేత్తల నుంచి వస్తున్న స్పందన సంతృప్తి కరంగా ఉందని చంద్రబాబు అభిప్రాయ పడ్డారు. ప్రతి అవకాశాన్ని రాష్ట్రానికి పెట్టుబడులు సాధించేందుకు ఉపయోగించుకోవాలని సిఎం చంద్రబాబు పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com