గుంటూరు నగరంలో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ఆదివారం తెల్లవారు జామున కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. శారదా కాలనీలో అరండల్ పేట పోలీసులు ఇంటింటికి తనిఖీలు చేపట్టారు. ఎలాంటి పత్రాలు లేని 42 బైక్‌లు, 3 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ..110 మంది సిబ్బందితో తనిఖీలు చేశామని, నెంబర్ ప్లేట్స్, సరైన పత్రాలు లేని 43 బైక్‌లు, మూడు ఆటోలు సీజ్ చేసినట్లు తెలిపారు. నెంబర్ ప్లేట్స్ లేని ద్విచక్ర వాహనాలనే నేరాలకు ఉపయోగిస్తున్నారన్నారు. రౌడీ, సస్పెక్ట్ షీట్స్ ఉన్న వారిపై ప్రత్యేక నిఘా పెట్టామని, గుంటూరు నగరంతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ కార్డెన్ సెర్చ్ కొనసాగిస్తామని ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు.