శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలోని శ్రీసూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు ఆదివారం నుంచి మూడు రోజుల పాటు జరగనున్నాయి. కూటమి ప్రభుత్వం కొలువుదీరాక రథసప్తమి వేడుకలను రాష్ట్ర పండగగా జరిపేందుకు ఉత్తర్వులు జారీచేసింది. ఇందులో భాగంగా ఈ నెల 2 నుంచి 4వ తేదీ వరకు ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.
మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, ఛత్తీగఢ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. రథసప్తమి వేడుకల నేపథ్యంలో ఉత్తరాంధ్రలో అన్ని దేవాలయాలకు చెందిన డిప్యూటీ కమిషనర్‌లను, అసిస్టెంట్ కమిషనర్‌లను.. ఇతర విభాగాల అధికారులను ఈ నెల 5వరకు అరసవల్లిలోనే విధులు నిర్వహించేలా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అలాగే మూడురోజుల పాటు హెలికాఫ్టర్ రైడ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు.