by Suryaa Desk | Sat, Dec 21, 2024, 07:56 PM
అతిలోక సుందరి అందాల తార శ్రీదేవి. లెజెండరీ యాక్టర్ శ్రీ దేవి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగు, తమిళం, హిందీ చిత్రాలలో నటించి కోట్లాదిమంది ప్రేక్షకులను సొంతం చేసుకుంది. సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇండస్ట్రీలో తొలి లేడీ పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకుంది. అయితే ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న శ్రీదేవి అకాల మరణం ప్రేక్షకులకు తీరని లోటు. శ్రీదేవి మరణించి దాదాపు 5 సంవత్సరాలు గడుస్తున్న ఆమె తన సినిమాలతో మన మధ్యలోనే ఉన్నట్లు అనిపిస్తుంది. తాజాగా శ్రీదేవి మరణంపై తన భర్త, బాలీవుడ్ డైరెక్టర్ స్పందిస్తూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ఇంతకీ ఏమన్నారంటే? భారతీయ సినీ ప్రపంచంలో శ్రీ దేవీ ఓ ధ్రువ తార. ఇండస్ట్రీలో తొలి లేడీస్ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకుంది కూడా ఈ నటే. శ్రీదేవి సినిమా ఇండస్ట్రీలోని ఎంతోమంది స్టార్ హీరోలతో నటించింది. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకుంది. తన అందం, అభినయంతో అభిమానుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయింది. అయితే ఎవరు ఊహించని విధంగా దుబాయ్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లి అక్కడి హోటల్ లోని బాత్రూం టబ్ లో పడిపోయి శ్రీదేవి మరణించారు. కానీ, శ్రీదేవి అకాల మరణం ఇప్పటికీ మిస్టరీ గానే ఉండిపోయింది. తమ అభిమాన నటి మరణం పై ఫ్యాన్స్ లలో ఎన్నో అనుమానాలు కూడా ఉన్నాయి. ఇదిలా ఉంటే డైరెక్టర్ బోనికపూర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నటి శ్రీదేవి పై పలు కామెంట్స్ చేశారు. శ్రీదేవితో తన రిలేషన్ ఎలా ఉండేదో గుర్తు చేసుకున్నారు. తాను మొదట్లో చాలా లావుగా ఉండే వాడిననీ, తాను బరువు తగ్గడానికి శ్రీదేవి ఎన్నో సలహాలు ఇచ్చిందని అన్నారు. వాస్తవానికి తాను బరువు తగ్గాలనే ఆలోచన తన భార్య వాళ్ళని కలిగిందని, తాను ఎప్పుడు నన్ను బరువు తగ్గమని సలహాలు ఇచ్చేదని పేర్కొన్నారు. తన ఆరోగ్యం గురించి తన భార్య శ్రీదేవీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని చెప్పుకొచ్చారు. తనతో వాకింగ్ వెళ్లే వాడినని, జిమ్ కూడా వెళ్లేవాడినని, శ్రీదేవి ఎప్పుడు ఏం తినాలి? ఏం చేయాలి ఆరోగ్యం గురించి చాలా జాగ్రత్తగా తీసుకునేదాని, ఆహార విషయంలో ఎంతో జాగ్రత్త వహించేదని చెప్పుకొచ్చారు. శ్రీదేవి మరణం గురించి గుర్తు చేసుకుంటూ బోనికపూర్ ఎమోషనల్ అయ్యారు. శ్రీదేవి ఇప్పటికీ తనతోనే ఉందనే ఫీలింగ్ ఉందని, తన భార్య ఇప్పటికి తనని బరువు తగ్గమని మోటివేట్ చేస్తుందని బరువు తక్కువని చెబుతున్నట్లు ఉంటుందని ఎమోషనల్ గా చెప్పుకొచ్చారు. శ్రీదేవి ఫిబ్రవరి 24, 2018 న దుబాయ్‌లో మరణించింది. ఫ్యామిలీ ఫంక్షన్‌కి హాజరయ్యేందుకు వెళ్లారు. శ్రీదేవికి బోనీ కపూర్ వీరికి ఇద్దరు కుమార్తెలు.. జాన్వీ కపూర్ ,ఖుషీ కపూర్. జాన్వీ 2018లో ధడక్ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆమె చివరిగా దేవర: పార్ట్ 1లో నటించి, తెలుగు ప్రేక్షకులకు మెప్పించింది.
Latest News