by Suryaa Desk | Sun, Dec 22, 2024, 03:01 PM
అమెరికాలో నిన్న గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అత్యంత ఘనంగా జరిగింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు శంకర్, నిర్మాత దిల్ రాజు, నటి అంజలి, పుష్ప-2 డైరెక్టర్ సుకుమార్ తదితరులు హాజరైన ఈ భారీ ఈవెంట్ కు డాలస్ నగరం ఆతిథ్యమిచ్చింది. ఈ కార్యక్రమానికి హాజరైన చరణ్ ఫ్యాన్స్ ను చూస్తే... అది తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒక ప్రాంతం అయ్యుంటుంది అనిపించేలా కోలాహలం అంబరాన్నంటింది. ఈ విశేష స్పందన చూసి చిత్రబృందం సంతోషం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో, హీరో రామ్ చరణ్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు పెట్టారు. థాంక్యూ సో మచ్ అమెరికా... మోస్ట్ మెమరబుల్ నైట్ అంటూ తన ఆనందాన్ని పంచుకున్నారు. గేమ్ చేంజర్ సినిమా కోసం ఈ అద్భుతమైన ఈవెంట్ ను నిర్వహించిన రాజేశ్ కల్లేపల్లి అండ్ టీమ్ కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు రామ్ చరణ్ తన పోస్టులో పేర్కొన్నారు. రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా నటించిన చిత్రం గేమ్ చేంజర్. సౌతిండియా దర్శక దిగ్గజం శంకర్ డైరెక్షన్ లో వస్తున్న ఈ చిత్రం జనవరి 10న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
Latest News