by Suryaa Desk | Sun, Jan 12, 2025, 08:51 PM
టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున నటించిన హిట్ సినిమాల్లో ‘మన్మథుడు’ ఒకటి. ఈ సినిమాలో నాగార్జున, బ్రహ్మనందం కామెడీ ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. అయితే ఈ మూవీలో హీరోయిన్‌గా చేసిన అన్షు అంబానీ 23 ఏళ్ల తర్వాత మళ్లీ హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనుంది.సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కుతున్న 'మజాకా' సినిమాలో అన్షు కీలకపాత్ర పోషించింది. ధమాకా లాంటి మాస్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన త్రినాథ రావు నక్కిన ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ లాంఛ్ ఈవెంట్ జరిగింది. అయితే ఈ సందర్భంగా త్రినాథ రావు మాట్లాడుతూ అన్షుపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం అందరినీ షాకయ్యేలా చేసింది."అన్షు లాంటి హీరోయన్.. ఎప్పుడో మేము యంగ్‌స్టర్‌గా ఉన్నప్పుడో ఇంకా చిన్నప్పుడో నాకు గుర్తులేదు. మన్మథుడు సినిమా చూసి ఏందిరా ఏందిరా ఈ అమ్మాయి లడ్డూలా ఉంది అనుకునేవాడ్ని అప్పుడు.. ఆ అమ్మాయిని చూడటానికే మన్మథుడు సినిమాకి వెళ్లిపోయేవాళ్లం.. ఓ రేంజ్‌లో ఉండేదయ్యా బాబూ.. మీకు తెలీకపోతే ఒకసారి ఫొటో పెట్టి చూడండి.. నెక్ట్స్ లెవల్. అలాంటి అమ్మాయి ఒక్కసారి ఈ సినిమాలో హీరోయిన్‌గా కళ్ల ముందు కనబడేసరికి ఇది నిజమేనా అనిపించింది.
Latest News