![]() |
![]() |
by Suryaa Desk | Fri, Apr 11, 2025, 03:51 PM
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘హరిహర వీరమల్లు’. పిరియడికల్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ సినిమాకు రూల్స్ రంజన్ దర్శకుడు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది.అయితే రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా కానీ మూవీ యూనిట్ సైలెంట్ గా ఉండడంతో సినిమా రిలీజ్ మళ్లీ పోస్ట్ పోన్ అయ్యిందని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. పవన్ కళ్యాణ్ కి సంబంధించి కొంచెం షూటింగ్ బ్యాలెన్స్ ఉందని.. అంతే కాకుండా పవన్ కుమారుడు అనుకోని రీతిలో ప్రమాదంలో గాయపడడంతో ఆ షూటింగ్ లో పాల్గొనడం కష్టమే అని చర్చ జరుగుతోంది. దీంతో సినిమా విడుదల ఆలస్యం కానున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇదే విషయంపై మూవీ మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.సినిమా రిలీజ్‌పై మరోసారి క్లారిటీ ఇస్తూ ఓ పోస్ట్ పెట్టారు. ఈ మేరకు ఆ పోస్టులో.. ప్రస్తుతం 'హరి హర వీరమల్లు' పనులు శరవేగంగా జరుగుతున్నట్లు రాసుకొచ్చారు. రీ రికార్డింగ్, డబ్బింగ్, వీఎఫ్‌ఎక్స్ పనులు జరుగుతున్నాయని.. ఈ వేసవికి ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాను అందిస్తామని హామీ ఇచ్చారు. ఇటీవల ప్రకటించినట్లే మే9 న మూవీ రిలీజ్ అవుతుందని.. ప్రేక్షకులు అంతకుముందు ఎప్పుడూ చూడని సినిమాటిక్ అనుభూతికి సిద్ధంగా ఉండాలన్నారు. అంతే కాకుండా ఓ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు