సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Wed, Apr 23, 2025, 03:02 PM
కశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడితో ఒక్కసారిగా భారత్ ఉలిక్కిపడింది. మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన బైసరన్ ప్రాంతంలో విహారానికి వచ్చినవారిపై పాశవిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 26 మంది పర్యటకులు ప్రాణాలు కోల్పోగా... మరో 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై సినీ సెలబ్రెటీలు సైతం దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఎక్స్ వేదికగా “పహల్గాం దాడి బాధితుల గురించి తెలిసి హృదయం ద్రవించిపోయింది. దాడిలో మృతిచెందిన వారి కుటుంబాలకు భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలి. శాంతి, న్యాయం కోసం ప్రార్థిస్తున్నా” అని తారక్ రాసుకొచ్చారు.
Latest News