|
|
by Suryaa Desk | Wed, Apr 23, 2025, 03:29 PM
నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్‌తో దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి మూడవసారి కలిసి "సారంగపాణి జాతకం" అనే టైటిల్ తో తమ తదుపరి ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకొని 'U/A' సర్టిఫికెట్ సొంతం చేసుకుంది. కానీ సినిమా రన్ టైమ్ ఇంకా వెల్లడి కాలేదు. తాజాగా ఇప్పుడు మేకర్స్ ఈ సినిమా యొక్క బుకింగ్స్ ఓపెన్ అయ్యినట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ సినిమా ఏప్రిల్ 25న విడుదల కానుంది. రూప కొడుయూర్ ఈ చిత్రంలో మహిళా ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ లో వెన్నెల కిషోర్, వైవా హర్ష, నరేష్ వికె, తనికెళ్ల భరణి మరియు శ్రీనివాస్ అవసరాల కీలక పాత్రలలో నటిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం సమకూర్చగా, పిజి విందా ఫోటోగ్రఫీ డైరెక్టర్ గా ఉన్నారు. ఫ్యామిలీ కామెడీ ఎంటర్‌టైనర్ అయిన ఈ చిత్రం ఒక అద్భుతమైన హాస్యం మరియు అద్భుతమైన తారాగణం కలగలిసి ఉంటుంది అని సమాచారం.
Latest News