|
|
by Suryaa Desk | Wed, Apr 23, 2025, 04:36 PM
మలయాళం నటుడు నాస్లెన్ ప్రధాన పాత్రలో నటించిన 'అలప్పుజా జింఖానా' ఏప్రిల్ 10, 2025న మలయాళంలో విడుదల అయ్యింది. ఈ స్పోర్ట్స్ డ్రామాకి సానుకూల స్పందన వచ్చింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద స్థిరంగా ఉంది మరియు ఇప్పుడు తెలుగు ప్రేక్షకులని అలరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఖలీద్ రెహ్మాన్ దర్శకత్వం వహించిన మలయాళ చిత్రం ఇప్పుడు ఏప్రిల్ 25, 2025న తెలుగు విడుదల కోసం సిద్ధమవుతోంది. ఈ సినిమా తెలుగు ప్రమోషన్స్ ని మేకర్స్ ఇటీవలే ప్రారంభించారు. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రముఖ యాంకర్ మంజూషతో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఫుల్ ఇంటర్వ్యూని మేకర్స్ ఈరోజు మధ్యాహ్నం 4:05 గంటలకి విడుదల చేసినట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో సరికికొత్త పోస్టర్ ని విడుదల చేసింది.ఈ చిత్రంలో లుక్మన్ అవరాన్, గణపతి ఎస్., సందీప్ ప్రదీప్, అనఘా రవి, ఫ్రాంకో ఫ్రాన్సిస్, బేబీ జీన్, శివ హరిహరన్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ప్లాన్ బి మోషన్ పిక్చర్స్ మరియు రీలిస్టిక్ స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రం సంగీతాన్ని విష్ణు విజయ్ స్వరపరిచారు.
Latest News