|
|
by Suryaa Desk | Thu, Apr 24, 2025, 09:28 AM
గేమ్ ఛేంజర్: శంకర్ దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఇటీవలి హై-బడ్జెట్ పొలిటికల్ డ్రామా 'గేమ్ ఛేంజర్' బాక్స్ఆఫీస్ వద్ద ప్రభావం చూపడంలో విఫలమైంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేసిన రామ్ నందన్ మరియు అప్పన్న గా నటించారు. ఈ సినిమా యొక్క తెలుగు వెర్షన్ శాటిలైట్ రైట్స్ ని జీ తెలుగు మరియు జీ సినిమాలు ఛానల్ సొంతం చేసుకుంది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా జీ తెలుగు ఛానల్ లో ఏప్రిల్ 27న సాయంత్రం 5:30 గంటలకి వరల్డ్ టెలివిషన్ ప్రీమియర్ ని ప్రదర్శించటానికి సిద్ధంగా ఉన్నట్లు ఛానల్ ప్రకటించింది. కియారా అద్వానీ కథానాయికగా నటించగా, ఎస్‌జే సూర్య ప్రతినాయకుడిగా నటించారు. ఈ చిత్రంలో అంజలి, శ్రీకాంత్, సునీల్, రాజీవ్ కనకాల, జయరాం కీలక పాత్రలలో నటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించగా, థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.
RRR: టాలీవుడ్ స్టార్ నటులు రామ్ చరణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ నటించిన బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా 'RRR' మళ్లీ ముఖ్యాంశాలు చేసింది. మాస్టర్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పుడు చిన్న స్క్రీన్లపై ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ ఏప్రిల్ 27, 2025న ప్రముఖ టెలివిజన్ ఛానెల్ స్టార్ మా ఛానల్ లో సాయంత్రం 5:30 గంటలకి ప్రసారం కానుంది. ఈ సినిమాలో అలియా భట్, అజయ్ దేవగన్, సముద్రఖని, ఒలివియా మోరిస్ మరియు ఇతరులు కూడా ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ బిగ్గీకి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.
Latest News