|
|
by Suryaa Desk | Fri, Apr 25, 2025, 03:51 PM
మన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ఇపుడు పలు సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రాల్లో భైరవం ఇంకా టైసన్ నాయుడు చిత్రాలు దాదాపు పూర్తి కావచ్చాయి. ఇక ఈ సినిమాలు కాకుండా తన నుంచి ఉన్న మరో చిత్రం తన కెరీర్ 11వ సినిమా కూడా ఉంది. దర్శకుడు కౌశిక్ పగళ్ళపాటి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంతో అనుపమ పరమేశ్వరన్ మరోసారి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో మరోసారి నటిస్తుంది.అయితే ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ కి ఇపుడు మేకర్స్ డేట్ ని ఫిక్స్ చేసేసారు. ఈ ఏప్రిల్ 27న ఈ సినిమా ఫస్ట్ ఫస్ట్ లుక్ ని విడుదల చేస్తున్నట్టుగా డేట్ అనౌన్స్ చేసేసారు. మరి ఈ చిత్రంలో ఈ యంగ్ హీరో ఎలా కనిపిస్తాడో చూడాలి. ఇక ఈ చిత్రం కోసం ఇద్దరు సంగీత దర్శకులు సామ్ సి ఎస్ అలాగే చైతన్ భరద్వాజ్ లు సంగీతం అందిస్తుండగా షైన్ స్క్రీన్ సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.
Latest News