|
|
by Suryaa Desk | Thu, Apr 24, 2025, 02:35 PM
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కోలీవుడ్ నటుడు ధనుష్ ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ రాబోయే తెలుగు సినిమాకి 'కుబేర' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ చిత్రంలో రష్మిక మందన్న మహిళా ప్రధాన పాత్రలో నటిస్తుంది. కుబేర 120 కోట్ల భారీ బడ్జెట్‌తో అత్యంత ఖరీదైన ప్రాజెక్ట్‌గా చెప్పబడుతోంది. ఈ సినిమా యొక్క ఫస్ట్ సింగల్ ని పోయిరా మామ అనే టైటిల్ తో విడుదల చేసారు. దేవి శ్రీ ప్రసాద్ కంపోస్ చేసిన మరియు ధనుష్ పడిన ఈ సాంగ్ తెలుగు, తమిళం, హిందీ, మలయాళం మరియు కన్నడలో విడుదల అయ్యింది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సాంగ్ యొక్క తెలుగు వెర్షన్ లిరికల్ షీట్ ని మేకర్స్ విడుదల చేసారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది.ఈ చిత్రంలో నాగార్జున, జిమ్ సర్భ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సంగీతం దేవి శ్రీ ప్రసాద్, కెమెరా హ్యాండిల్ నికేత్ బొమ్మి, ఎడిటింగ్ కార్తీక శ్రీనివాస్ అందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి మరియు అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకాలపై సునీల్ నారంగ్ మరియు పుస్కుర్ రామ్ మోహన్ రావు భారీ బడ్జెట్‌తో భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చివరి నిర్మాణ దశలో ఉన్న ఈ చిత్రం జూన్ 20న తమిళం, తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది.
Latest News