|
|
by Suryaa Desk | Sat, Apr 26, 2025, 03:16 PM
వైష్ణవి చైతన్య.. షార్ట్ ఫిల్మ్ నటిగా కెరీర్ మొదలుపెట్టిన వైష్ణవి చైతన్య.. సినిమాల్లోనూ బన్నీ, నాని సరసన సహాయ పాత్రలు చేసింది. ఎప్పుడైతే 'బేబి' మూవీతో హీరోయిన్ గా మారిందో ఈమె ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఈ ముద్దుగుమ్మ తన కెరీర్‌ను యూట్యూబ్‌లో షార్ట్ ఫిల్మ్స్‌తో ప్రారంభించింది. "లవ్ ఇన్ 143 అవర్స్", "ది సాఫ్ట్‌వేర్ డెవలపర్", "అరెరె మానస", "మిస్సమ్మ" వంటి షార్ట్ ఫిల్మ్స్‌తో యువతలో మంచి గుర్తింపు పొందింది.ఇక 2020లో "అల వైకుంఠపురములో" చిత్రంతో సినీ రంగంలోకి అడుగుపెట్టింది, ఇందులో ఆమె అల్లు అర్జున్ సోదరి పాత్రలో నటించింది. అయితే, 2023లో విడుదలైన "బేబీ" ఆమె కెరీర్‌ను మలుపు తిప్పింది. ఈ చిత్రంలో ఆమె ప్రధాన పాత్ర పోషించి, తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది."బేబీ" కోసం ఆమె ఫిల్మ్‌ఫేర్ క్రిటిక్స్ అవార్డ్ ఫర్ బెస్ట్ యాక్ట్రెస్ - తెలుగు, SIIMA అవార్డ్ ఫర్ బెస్ట్ ఫీమేల్ డెబ్యూ గెలుచుకుంది. 2024లో ఆమె "లవ్ మీ: ఇఫ్ యు డేర్" అనే రొమాంటిక్ హారర్ థ్రిల్లర్‌లో ఆశిష్ రెడ్డితో కలిసి నటించింది, అయితే ఈ బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం సాధించలేదు.రీసెంట్ గా సిద్ధు జొన్నలగడ్డతో "జాక్" అనే లో నటించింది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ కూడా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. సోషల్ మీడియాలో వైష్ణవి చాలా యాక్టివ్ గా ఉంటుంది.ఇన్‌స్టాగ్రామ్‌లో 23 లక్షల మంది ఫాలోవర్స్‌తో తన ఫోటోషూట్స్ మరియు అప్‌డేట్స్‌ను తరచూ పంచుకుంటుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫోటోలకు కుర్రాళ్ళు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.