|
|
by Suryaa Desk | Sat, Dec 09, 2023, 02:58 PM
ఈరోజు తెలంగాణ ప్రజలకు పండగరోజని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 2009 డిసెంబర్ 9న తెలంగాణ ప్రక్రియ ప్రారంభమైందని.. తెలంగాణ తల్లి అంటే సోనియమ్మ రూపం కనిపిస్తుందన్నారు. నాది తెలంగాణ అని చెప్పుకునే అవకాశం మనకు సోనియమ్మ ఇచ్చారని కొనియాడారు. రాష్ట్ర ప్రజల కోసం సోనియమ్మ 6 గ్యారంటీలను ఇచ్చారని.. ఇవాళ 2 గ్యారంటీలను అమలు చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుందని అన్నారు. 6 గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని బాలికలు, మహిళలు, ట్రాన్స్ జెండర్లకు TSRTC బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించేందుకు ఉద్దేశించిన మహాలక్ష్మి పథకం ప్రారంభమైంది. హైదరాబాద్‌లో సీఎం రేవంత్ ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది.