by Suryaa Desk | Fri, Dec 20, 2024, 12:44 PM
నిజాంపేట్ మండల పంచాయతీలోని మాణిక్ నాయక్ తండాలో సేవలాల్ మహారాజ్ దుర్గ భవాని మందిరము భూమి పూజలో డీసీసీ ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి శుక్రవారం హాజరయ్యారు. ఐక్యంగా ఉండి కొత్త పనులను ప్రారంభించడం అభినందనీయం అన్నారు. ముందుగా తండా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాణిక్ రెడ్డి మాజీ సర్పంచ్ భీమ్రావు, బంగారు రాజు, రాధా కిషన్, జల శంకర్, సాయిలు, తండా నాయకులు, తదితరులు పాల్గొన్నారు.