by Suryaa Desk | Fri, Dec 20, 2024, 01:09 PM
హైదరాబాద్ శీతాకాలం సందర్భంగా దేశవ్యాపత్ంగా రోజురోజుకూ ఊష్ణోగ్రతలు దారుణంగా పడిపోయి.. చలితీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో స్కూళ్లకు సెలవులు ప్రకటిస్తూ.. దేశంలోని వివిధ రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఒక్కో రాష్ట్రంలో 15 రోజుల పాటు పాఠశాలలను మూసివేయనున్నారు. ఏ రాష్ట్రంలో ఎప్పుడెప్పుడు, ఎన్ని రోజులు స్కూళ్లకు సెలవులు ఉండనున్నాయంటే. దేశ రాజధాని ఢిల్లీలో రోజురోజుకూ ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే జనవరి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఢిల్లీలోని అన్ని స్కూళ్లకు సెలవులు ప్రకటిస్తూ.. ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ సర్కార్ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ 15 రోజులతోపాటు ఈనెల 25వ తేదీన క్రిస్మస్ పండగ సందర్భంగా ఆరోజు కూడా సెలవు ప్రకటించారు. ఈ క్రమంలోనే ఉత్తర్ప్రదేశ్లో ఈనెల 25వ తేదీ నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు స్కూళ్లకు సెలవులు ఇస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించారు. ఈ నెల 24వ తేదీ నుంచి ప్రారంభం కానున్న శీతాకాల సెలవులు.. ఈనెల 31వ తేదీ వరకు కొనసాగనున్నాయి. అయితే ఆ తర్వాత వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని.. సెలవులను పొడిగించాలా వద్దా అనేది అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు. శీతాకాల సెలవులకు సంబంధించి హర్యానా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. మరికొన్ని రోజుల పాటు హర్యానాలో చలి గాలుల తీవ్రత పెరగనున్న నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. గతేడాది శీతాకాలం సందర్భంగా జనవరి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రకటించారు. జమ్మూ కాశ్మీర్ పాఠశాల విద్యా శాఖ.. కాశ్మీర్ లోయతోపాటు జమ్మూ డివిజన్లోని పాఠశాలలకు శీతాకాల సెలవులను ప్రకటించింది. జమ్మూ కాశ్మీర్లోని 5వ తరగతి వరకు పాఠశాలలు డిసెంబర్ 10 నుంచి ఇచ్చారు. అంతేకాకుండా 6 నుంచి 12వ తరగతుల వరకు డిసెంబర్ 16 నుంచి పాఠశాలలు మూసివేశారు. అయితే ఈ స్కూళ్లకు శీతాకాల సెలవులు ఫిబ్రవరి 28వ తేదీ వరకు కొనసాగనున్నాయి. జమ్మూ కాశ్మీర్లో శీతాకాలంలో నిత్యం మంచు కురుస్తుంది కాబట్టి అక్కడి ప్రభుత్వం.. ఈ సమయంలో ఎక్కువగా స్కూళ్లకు హాలిడేస్ ఇస్తుంది.