by Suryaa Desk | Sat, Dec 21, 2024, 12:46 PM
ప్రతి ఇంట్లో ఒక స్వయం సహాయక సంఘం సభ్యురాలు ఉండాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన అన్నారు. సెర్ప్ కార్యక్రమాలపై డీపీఎంలు, ఏపీఎంలు, కమ్యూనిటీ కో ఆర్డినేటర్లతో కలెక్టరేట్లో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామీణాభివృద్ధిలో భాగంగా మహిళలకు స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పించాలని అధికారులకు సూచించారు.