![]() |
![]() |
by Suryaa Desk | Sat, Mar 29, 2025, 09:22 AM
తెలంగాణ రాష్ట్రంలోని అసిఫాబాద్ జిల్లాలో వింత సంఘటన వెలుగు చూసింది. ఒకే పెళ్లి మండపంలో.. ఒకేసారి ఇద్దరు యువతుల మెడలో తాళి కట్టి వార్తల్లోకెక్కాడు కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా లింగపూర్ మండలం గుమ్నూర్‌కు చెందిన సూర్యదేవ్ అనే యువకుడు. అంతేకాదు.. పెళ్లి శుభలేఖలోనే.. తాను ఇద్దరు యువతులను ఒకే సారి వివాహం చేసుకుబోతన్నట్లు ప్రకటించాడు. ఈ పెళ్లి చూడటం కోసం జనాలు భారీగా తరలి వచ్చారు. అలా వేయి మంది బంధుమిత్రుల సమక్షంలో.. వేదమంత్రాల సాక్షిగా.. ఇద్దరు యువతుల మెడలో మూడు ముళ్లు వేసి.. ముచ్చటగా ముగ్గురు అన్నట్లుగా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. ఇక ఈ అరుదైన పెళ్లి వార్త కాస్త సోషల్ మీడియా తెగ వైరల్ అవుతోంది.మరి ఒకే సారి ఇద్దరిని పెళ్లిడిన సూర్యదేవ్ బాగా డబ్బున్న వ్యక్తా అంటే.. ఓ సాధారణ రైతు. మరి అతడు వివాహం చేసుకుంది అక్కాచెల్లెళ్లానా అంటే అది కూడా కాదు. పైగా ఆ ఇద్దరు యువతులు వేర్వేరు గ్రామాలకు చెందిన వారు. మూడేళ్ల కిందట ఈ ముగ్గురు మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరు యువతులను ఒకేసారి ప్రేమించిన సూర్యదేవ్.. ఈ విషయాన్ని ముందగానే వారికి చెప్పాడు. అంతేకాక తనకు ఇద్దరు ముఖ్యమే అని.. అందుకే ఇద్దరిని పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నట్లు తెలిపాడు. ఆ యువుతులు కూడా సూర్యదేవ్‌ను వదులుకోవడం ఇష్టం లేక పెళ్లికి అంగీకరించారు. ఇద్దరు యువతులు పెళ్లికి అంగీకరించడంతో.. ఒకే పెళ్లి మండపంలో ఒకే ముహుర్తానికి వేయి మంది అతిథుల సమక్షంలో ప్రేమించిన ఇద్దరు అమ్మాయిలను పెళ్లి చేసుకుని.. ఇద్దరు భార్యల ముద్దుల భర్తగా వార్తల్లోకెక్కాడు. పైగా ఈ ఇద్దరికీ భవిష్యత్ లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటానని బాండ్ కూడా రాసిచ్చాడు. ఇద్దరు అమ్మాయిల తల్లిదండ్రులు బాండ్‌ను అంగీకరించడంతో.. వారు ముచ్చటగా ముగ్గరయ్యారు. ఈ పెళ్లి వార్త తెలిసిన పెళ్లి కానీ ప్రసాదులు.. ఏం లక్కు రా నాయనా.. మాకు ఒక్కరే దిక్కు లేదంటే.. నువ్వు ఏకంగా ఇద్దరిని.. అది కూడా ఒకే వేదిక మీద పెళ్లి చేసుకున్నావు.. తోపహే నువ్వు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.