![]() |
![]() |
by Suryaa Desk | Sat, Mar 29, 2025, 02:27 PM
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరగడంతో భారతీయులు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ద్విచక్ర వాహనాలతో పాటు ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేస్తున్నారు. అయితే, ఎలక్ట్రిక్ కార్ల విషయంలో బ్యాటరీ మన్నికపై వినియోగదారుల్లో కొంత అసంతృప్తి నెలకొంది. దీనిని గుర్తించిన ప్రముఖ వాహనాల తయారీ కంపెనీ మారుతి సుజుకీ సరికొత్త ఎలక్ట్రిక్ కారును మార్కెట్లోకి తీసుకురానున్నట్లు తాజాగా ప్రకటించింది. ‘ఈ విటారా’ పేరుతో తీసుకొస్తున్న ఈ కారును ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ పెడితే 500 కిలోమీటర్లు ఆగకుండా ప్రయాణించవచ్చని చెబుతోంది. తయారీ తుది దశకు చేరుకుందని, ఈ ఏడాది చివరిలోగా ‘ఈ విటారా’ను మార్కెట్లో విడుదల చేస్తామని ప్రకటించింది. మరోవైపు, భారత్ కు చెందిన టాటా కంపెనీ కూడా ఓ కొత్త ఈవీ కారును తీసుకురానుంది. టాటా హారియర్ పేరుతో మార్కెట్లోకి విడుదల చేయనున్న ఈ కారులో 75 కేడబ్ల్యూహెచ్ లిథియం అయాన్ బ్యాటరీ అమర్చినట్లు కంపెనీ పేర్కొంది. దీంతో ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే 500 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని తెలిపింది.