![]() |
![]() |
by Suryaa Desk | Sat, Mar 29, 2025, 02:36 PM
రంగారెడ్డి జిల్లా, రాజేంద్రనగర్, అత్తాపూర్ లో విషాదం నెలకొంది. హైదరాబాద్‌లో టాప్ మెహందీ ఆర్టిస్ట్ పింకీ చున్నీతో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. స్థానికులు ఇచ్చిన సమాచారం అందుకున్న అత్తాపూర్ పోలీసులు (Police).. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని.. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. సంవత్సరం క్రితం అమిష్ లోయా అనే వ్యక్తితో పింకి కోర్టు మ్యారేజ్ చేసుకున్నారు. అయితే కుటుంబ కలహాల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలియవచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. పింకీ ఆత్మహత్యకు తన భర్త వేధింపులు కారణమా లేదా వేరే ఏమైనా కారణమా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.