![]() |
![]() |
by Suryaa Desk | Mon, Mar 31, 2025, 08:53 PM
హైదరాబాదులోని హెచ్ సీయూ వద్ద 400 ఎకరాల విలువైన స్థలాన్ని ధ్వంసం చేస్తూ పచ్చదనంపై దాడి చేస్తున్నారని, ఆ ప్రాంతంలో బుల్డోజర్లు, జేసీబీలు తిరుగుతున్నాయని, వాటిని చూసి నెమళ్లు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ నెమళ్లు సాయం కోసం ఎదురు చూస్తున్నాయని పేర్కొన్నారు.ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. కంచ గచ్చిబౌలి సమీపంలోని భూముల్లో జేసీబీలు, బుల్డోజర్ల ఉన్న ఫొటోలను, రాత్రి వేళల్లో అక్కడి చెట్లను తొలగిస్తున్న వీడియోను ఆయన పోస్టు చేశారు.హెచ్‌సీయూ సమీపంలోని గచ్చిబౌలి భూముల విషయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇప్పటికైనా స్పందించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇవన్నీ చూస్తూ కూడా రాహుల్ గాంధీ మౌనం వహిస్తే ఎలా అని ఆయన ప్రశ్నించారు.