![]() |
![]() |
by Suryaa Desk | Mon, Mar 31, 2025, 08:58 PM
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై టోల్ ఛార్జీలు పెరగనున్నాయి. వివిధ వాహనాలకు కిలోమీటరుకు 10 పైసల నుంచి 70 పైసల వరకు ఛార్జీలు పెరిగాయి. కారు, జీపు, లైట్ మోటార్ వాహనాలకు కిలోమీటరుకు 10 పైసలు పెంచారు. దీంతో ప్రస్తుతం ఉన్న ఛార్జీ రూ.2.34 నుంచి రూ.2.44కు పెరిగింది. మినీ బస్ మరియు ఎల్‌సీవీలకు 20 పైసలు పెంచారు. ఈ వాహనాలకు కిలోమీటరుకు ఛార్జీ రూ.3.77 నుంచి రూ.3.94కు పెరుగుతుంది. డబుల్ యాక్సిల్ బస్సులకు కిలోమీటరుకు రూ.6.69 నుంచి రూ.7కు పెంచారు. భారీ వాహనాలకు రూ.15.09 నుంచి రూ.15.78కి పెంచారు. ఓఆర్ఆర్ పై ఐఆర్బీ ఇన్‌ఫ్రా సంస్థ టోల్ వసూలు చేస్తోంది. పెరిగిన ఛార్జీలు రేపటి నుంచి అమల్లోకి వస్తాయి.