![]() |
![]() |
by Suryaa Desk | Mon, Mar 31, 2025, 09:16 PM
కంచ గచ్చిబౌలి భూములు ప్రభుత్వానివేనని టీజీఐఐసీ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ఇందులో హెచ్‌సీయూ భూమి లేదని తెలిపింది. 400 ఎకరాల భూమి ప్రభుత్వ ఆధీనంలో ఉందని, ఇది అటవీ శాఖ భూమి అని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని టీజీఐఐసీ తన ప్రకటనలో పేర్కొంది. ఈ భూమి రెవెన్యూ రికార్డుల్లోనూ ప్రభుత్వ భూమిగానే నమోదై ఉందని వెల్లడించింది. అక్కడ నెమళ్లు, ఇతర జంతువులు లేవని తెలిపింది. ప్రపంచస్థాయి ఐటీ మౌలిక వసతులు, అనుసంధానత పెంపు, తగినంత పట్టణ స్థలాల లభ్యత అనే ప్రభుత్వ ప్రాధాన్యానికి ఈ ప్రాజెక్టు కట్టుబడి ఉందని పేర్కొంది.