![]() |
![]() |
by Suryaa Desk | Mon, Mar 31, 2025, 09:18 PM
తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లాలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. బోనకల్ మండలంలో తండ్రి ప్రమాదవశాత్తు చెరువులో పడిపోగా, అతడిని రక్షించే ప్రయత్నంలో కుమారుడు కూడా మృతి చెందాడు. ఈ దుర్ఘటన సోమవారం బోనకల్ మండలం పరిధిలోని ఆలపాడు గ్రామంలో జరిగింది. ఆలపాడు గ్రామానికి చెందిన పఠాన్ యూసుఫ్ ఖాన్ గ్రామంలోని చెరువులోకి దిగగా, ప్రమాదవశాత్తూ పట్టు కోల్పోయి నీటిలో మునిగిపోయాడు.ఈ విషయాన్ని గమనించిన కుమారుడు పఠాన్ కరీముల్లా ఖాన్ తన తండ్రిని కాపాడేందుకు చెరువులోకి దిగాడు. దురదృష్టవశాత్తు, తండ్రితో పాటు కుమారుడు కూడా నీట మునిగి మరణించాడు. రంజాన్ పండుగ రోజున తండ్రీకొడుకులు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.