|
|
by Suryaa Desk | Tue, Nov 18, 2025, 12:18 PM
ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ కోసం రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పి అండ్ డి కాలనీ, ఎర్రబోడ ప్రాంతాల్లో మంగళవారం ఉదయం 4 నుంచి 8 గంటల వరకు డీసీపీ యోగేష్ గౌతమ్ ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో 300 మంది పోలీసు సిబ్బంది పాల్గొని, 350 పైగా ఇళ్లలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాలు, చలానాలు లేని 38 ద్విచక్ర వాహనాలను, 14 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. పి అండ్ టీ కాలనీలో ఉగాండా, సూడాన్‌కు చెందిన 36 మందిని తనిఖీ చేయగా, వారిలో ముగ్గురి వీసా గడువు ముగిసినట్లు గుర్తించారు. ఆఫ్రికన్లకు డ్రగ్ టెస్ట్ నిర్వహించగా నెగటివ్ వచ్చింది. ఈ వివరాలను డీసీపీ ఎర్రబోడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.