|
|
by Suryaa Desk | Wed, Nov 19, 2025, 01:38 PM
అంతర్జాతీయ మార్కెట్లలోని బలహీన ధోరణులకు అనుగుణంగా దేశీయంగా బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. పసిడి ప్రియులకు, పెట్టుబడిదారులకు ఇది ఊరటనిచ్చే అంశం కాగా, మార్కెట్ వర్గాల్లో ఈ ఆకస్మిక తగ్గుదల చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ బులియన్ మార్కెట్లో బుధవారం 10 గ్రాముల 99.9 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర ఏకంగా రూ.3,900 తగ్గి రూ.1,25,800కు దిగివచ్చింది. అదేవిధంగా, 99.5 శాతం స్వచ్ఛత గల బంగారం ధర కూడా ఇదే స్థాయిలో తగ్గి రూ.1,25,200గా నమోదైంది. బంగారం బాటలోనే వెండి కూడా పయనించింది. కిలో వెండి ధర రూ.7,800 మేర భారీగా పతనమై రూ.1,56,000కు పడిపోయింది. వచ్చే నెలలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందన్న అంచనాలు బలహీనపడటమే ఈ పతనానికి ప్రధాన కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు.