|
|
by Suryaa Desk | Sat, Feb 07, 2026, 08:25 PM
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పటాన్‌చెరు నియోజకవర్గంలోని గుమ్మడిదల మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల తరఫున ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గోవర్ధన్ రెడ్డి గారు, గూడెం మధు గారితో పాటు బీఆర్ఎస్ నాయకులు మాద్రి పృథ్వీరాజ్ గారు పాల్గొన్నారు.ఈ సందర్భంగా పృథ్వీరాజ్ గారు ప్రజలతో సన్నిహితంగా మమేకమై, గత పదేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం గౌరవనీయులు కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తూ, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా అమలు చేసిన అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.ఈ అభివృద్ధి నిరంతరం కొనసాగాలంటే కారు గుర్తుకు ఓటు వేసి మున్సిపల్ ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీని ఘన విజయం వైపు నడిపించాలని ప్రజలను కోరారు.ఈ కార్యక్రమంలో రామచందర్ రెడ్డి గారు, యాదగిరి యాదవ్ గారు, విజయ్ గారు, నర్రా భిక్షపతి గారు, కంకర శ్రీను గారు, షకీల్ గారు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు MPR యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.