|
|
by Suryaa Desk | Sun, Feb 08, 2026, 12:56 PM
భువనగిరి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏఎస్ రావు నగర్ డివిజన్ అధ్యక్షులు కే. శెట్టి ప్రసాద్ సీనియర్ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించి, పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, అధికారంలోకి వస్తే భువనగిరిని మరింత అభివృద్ధి చేస్తామని, మౌలిక వసతుల మెరుగుదల, అన్ని వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.