|
|
by Suryaa Desk | Sun, Feb 08, 2026, 06:39 PM
బాచుపల్లిలో రామరాజు కాటన్ నూతన షోరూం ప్రారంభ కార్యక్రమంలో బి.ఆర్.ఎస్.ఎల్పీ. విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్. ఈ రోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ నిజాంపేట్ సర్కిల్ పరిధిలోని బాచుపల్లి ప్రాంతంలో జాలీ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన “రామరాజు కాటన్ షోరూం” ను బీఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ స్థానికంగా ఇలాంటి వ్యాపార సంస్థలు ప్రారంభమవడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. వ్యాపార రంగంలో పెట్టుబడులు పెరగడం వల్ల ప్రాంత అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, నిజాంపేట్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్, మాజీ కార్పొరేటర్లు ఆగం రాజు,రాఘవేంద్రరావు, సుజాత, బొర్రా దేవి చందు, మాజీ కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాసరెడ్డి, కో ఆప్షన్ సభ్యులు చంద్రగిరి జ్యోతి సతీష్, సీనియర్ నాయకులు బొబ్బా శ్రీనివాస్, సాంబశివ రెడ్డి, శ్రీకర్ గుప్తా, జశ్వంత్, స్వామి, ప్రదీప్, వైయస్సార్, నరసింహా రాజు, ప్రసాద్, మెహబూబ్, ఆనంద్ రెడ్డి, మహిళా నాయకులు లలిత, కృష్ణ మంజరి తదితరులు పాల్గొన్నారు.