|
|
by Suryaa Desk | Sun, Feb 08, 2026, 06:42 PM
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని ఇంద్రేశం మున్సిపాలిటీలో బచ్చుగుడా, ఇస్నాపూర్ మున్సిపాలిటీలోని చిట్కుల్ ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రోడ్‌షోతో పాటు విస్తృత ప్రచారం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, సిద్ధిపేట శాసనసభ్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారితో కలిసి బీఆర్ఎస్ నాయకులు మాద్రి పృథ్వీరాజ్ గారు పాల్గొన్నారు.ఈ సందర్భంగా హరీష్ రావు గారు మాట్లాడుతూ, “అన్నం పెట్టినోళ్లకు ఓటు వేస్తారా? లేక సున్నం పెట్టినోళ్లకు ఓటు వేస్తారా? అన్నది ప్రజలు ఆలోచించాలి” అంటూ ప్రజలను ప్రశ్నించారు.కేసీఆర్ గారి నాయకత్వంలో గత పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మిషన్ భగీరథ కింద ఇంటింటికీ నల్లా కనెక్షన్లు అందించామని గుర్తు చేశారు. అలాగే ఇంద్రేశం నుంచి ఇస్నాపూర్ వరకు బచ్చుగుడెం మీదుగా కొత్త రోడ్డు నిర్మించి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించామని తెలిపారు. బచ్చుగుడెం వద్ద నక్కవాగుపై వంతెనను కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే నిర్మించిందని పేర్కొన్నారు.ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం విషయానికి వస్తే, “బస్సు ఫ్రీ తప్ప మిగతా అన్ని హామీలు తుస్సుమంటున్నాయి.కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోంది” అంటూ తీవ్ర విమర్శలు చేశారు.అంతేకాకుండా,“ఈ ప్రభుత్వంలో పెళ్లైన మహిళలకు రావాల్సిన కళ్యాణ లక్ష్మి పథకాన్ని కూడా బిడ్డ పుట్టిన తర్వాతే ఇస్తున్నారు” అంటూ కాంగ్రెస్ పాలనపై ఆగ్రహం వ్యక్తం చేశారు.అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, ఇంద్రేశం, ఇస్నాపూర్ మున్సిపాలిటీలతో పాటు పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని ఐదు మున్సిపాలిటీల్లోని అన్ని వార్డుల్లో కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ పార్టీకి ఘన విజయం చేకూర్చాలని పిలుపునిచ్చారు.అభివృద్ధి కావాలంటే – నమ్మకమైన పాలన కావాలంటే – కారు గుర్తుకే ఓటు వేసి బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో పటాన్‌చెరు నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి గారు, సీనియర్ నాయకులు గూడెం మధు గారు, కార్పొరేటర్ మెట్టు కుమార్ గారు, గడీల శ్రీకాంత్ గౌడ్ గారు, విజయ్ గారు, యాదగిరి గారు, నర్ర బిక్షపాటి గారు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు మరియు MDR యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు