రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జాతీయ రహదారి-44 దారి దోపిడీ ఘటనను సవాలుగా తీసుకున్న వనపర్తి జిల్లా పోలీసులు 2 రోజుల్లో ఛేదించారు. ఆదివారం మల్టీజోన్-II ఐజీ సత్యనారాయణ, ఎస్పి రావుల గిరిధర్ వివరాలు వెల్లడించారు.
పెబ్బేర్ శివారులోని ఎన్. హెచ్-44 రోడ్ పై వేకువజామున 2గంటల సమయంలో భాదితులు వాహనాన్ని నిలిపి నిద్రపోగా దుండగులు కారుపై రాళ్ళతో దాడిచేసి మహిళల మెడల్లోని పుస్తెలతాళ్లు, బంగారు ఆభరణాలు దోపిడి చేశారన్నారు.