తెనాలి ఇస్లాంపేటకు చెందిన షేక్ సుల్తాన్ (26) కొంతకాలంగా గంజాయికి బానిసగా మారాడు. ఆదాయం కోసం గంజాయిని చిన్న మొత్తంలో ప్యాకెట్లుగా చేసి అమ్మకాలు ప్రారంభించాడు. నిందితుడు ముత్తింశెట్టిపాలెంలో శనివారం గంజాయి విక్రయించేందుకు నిలబడి ఉండగా, అతనిపై అనుమానం వచ్చిన పోలీసులు తనిఖీ చేశారు. అతని వద్ద 300 గ్రాముల గంజాయి లభించింది. దీనిపై కేసు నమోదు చేసినట్లు వన్ టౌన్ సీఐ మల్లికార్జున్ రావు తెలిపారు