పలాస రైల్వే స్టేషన్ నందు శనివారం నాడు చైల్డ్ హెల్ప్ డెస్క్ సూపర్వైజర్ బాల సరస్వతి మరియు ఆర్పిఎఫ్ సిబ్బంది కలిసి రైలు ప్రయాణికులకు బాల బాలికలు ఎవరైనా ఆపదలో ఉన్న ఎడల టోల్ ఫ్రీ నెంబర్ 1098 లేదా 139 కు సంప్రదించాలని చెప్పడం జరిగింది. అలాగే పిల్లల అక్రమ రవాణా, భిక్షాటన, తప్పిపోయిన పిల్లలు, మొదలగు వంటి విషయాల గురించి చైల్డ్ హెల్ప్ డెస్క్ వారు అవగాహన కల్పించడం జరిగింది.