రాజంపేట నియోజకవర్గానికి చెందిన కొలాటం నరసింహం, తన భార్య సుజాత, కుమారుడు బాల మణి చరణ్ డిసెంబర్ 22 రాత్రి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. వారి పిల్లలు హర్షిణి, సాయి మణి దీప్ లను ఆదుకునేందుకు ప్రభుత్వం తరపున తక్షణ సాయంగా లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించాలని శనివారం ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఎక్స్ గ్రేషియా త్వరగా అందేలా చూడాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు.