తెలుగు తేజం కోనేరు హంపిని సీఎం చంద్రబాబు అభినందించారు. కోనేరు హంపి విజయం దేశానికే గర్వకారణమంటూ ట్విట్టర్ (X) వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.
2024..భారతదేశ చెస్ క్రీడాకారులకు మరిచిపోలేని సంవత్సరమని పేర్కొన్నారు. కాగా, కోనేరు హంపికి మంత్రి లోకేశ్ కూడా అభినందనలు తెలిపారు. అసాధారణమైన పట్టుదల, సంకల్పం, నైపుణ్యం హంపి సొంతమని లోకేశ్ ట్వీట్ చేశారు.