ర్యాపిడ్ ఛాంపియన్‌గా నిలిచిన కోనేరు హంపిని ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా అభినందించారు. “ఒక ‘భారత రాణి’ చెస్ బోర్డును శాసించారు. కోనేరు హంపి తన అద్భుతమైన ఆట తీరుతో మమ్మల్ని ఎంతో గర్వించేలా చేశారు.
భారత చెస్‌కు అద్భుతమైన సంవత్సరంగా నిలిచిన ఈ ఏడాదికి విజయవంతమైన ముగింపును అందించినందుకు కృతజ్ఞతలు!’’ అంటూ మహీంద్రా సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపించారు.