తిరుపతి శ్రీవారిమెట్టు దగ్గర భక్తులు ఆందోళనకు దిగారు. టైం స్లాట్ దర్శనం టోకెన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రోజుకు 3 వేల టోకెన్లు జారీ చేస్తున్నారని, అయితే దర్శనం టోకెన్ల దందా సాగుతుందని భక్తులు ఆరోపిస్తున్నారు.
తద్వారా సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులకు టోకెన్లు అందడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సొంతవాహనాల్లో వచ్చేవారికి కూడా టోకెన్లు అందడంలేదని మండిపడుతున్నారు.