తెలుగులో తీర్పులు ఇవ్వడం సులభం కాదని ప్రపంచ తెలుగు రచయితల సంఘం గౌరవ అధ్యక్షుడు, ఎమ్మెల్యే బుద్ధ ప్రసాద్ అన్నారు. ఇందుకోసం ప్రత్యేక పదాలు అవసరమని చెప్పారు. నిఘంటువులు చూసి చాలా పదాలు రాయాల్సిన అవసరం ఉందన్నారు. విజయవాడలో నిర్వహించిన ప్రపంచ తెలుగు రచయితల మహాసభలో ఆయన మాట్లాడారు. తెలుగులో తీర్పుల కోసం అనేక చర్యలు చేపట్టినట్లు గుర్తుచేశారు. బ్రిటిష్ హయాంలో తెలుగులో, నిజాం కాలంలో ఉర్దూలో తీర్పులు వచ్చాయని గుర్తుచేశారు.