బ్లిట్జ్ చెస్ ఛాంపియన్‌గా కోనేరు హంపి నిలిచారు. ‘కోనేరు హంపి విజయంతో భారతదేశం గర్విస్తోంది’ అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ట్విట్టర్ వేదికగా ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఆమె అద్భుతమైన విజయం భారత్ చెస్ క్రీడకు అద్భుతమైన సంవత్సరాన్ని అందించిందని చంద్రబాబు తెలిపారు. మరోవైపు ఆనంద్ మహేంద్రా, మాజీ సీఎం జగన్ కూడా ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.