కేరళ ఎమ్మెల్యే, సీపీఎం నేత యు.ప్రతిభ కొడుకును గంజాయి కేసులో పోలీసులు అరెస్టు చేశారు. ఎమ్మెల్యే కొడుకుతోపాటు మొత్తం 9 మంది యువకులను అరెస్టు చేసినట్లు తెలిపారు.
అలప్పుజ జిల్లాలోని కుట్టనాడులో గంజాయి సిగరెట్లు తాగుతుండగా వారిని అదుపులోకి తీసుకుని అనంతరం వారందరినీ బెయిల్‌పై విడుదల చేసినట్లు పేర్కొన్నారు. దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ.. తన కొడుకు అరెస్టు కేవలం పుకారు మాత్రమేనని కొట్టిపారేశారు.