బంగ్లాదేశ్‌లో ఒకవైపు రాజకీయ అస్థిరత, మరోవైపు మైనారిటీలపై హింస కొనసాగుతోంది. ఈనేపథ్యంలో 18 ఏళ్ల లోపు వారు కూడా.. మైనర్లకు కూడా ఓటు హక్కు కల్పించాలని బంగ్లాదేశ్ ఎన్నికల సంఘానికి మహ్మద్ యూనస్ సిఫారసు చేశారు.
ఇది ఆమోదం పొందినట్లయితే బంగ్లాదేశ్‌లోని మైనర్లు అంటే 17 వయసు ఉన్నవారు కూడా ఓటు వేయడానికి అర్హులవుతారు. అయితే ఈ సిఫారసుపై పలు విమర్శలు చెలరేగుతున్నాయి.