తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలో శనివారం భారీ పేలుడు సంభవించింది. సత్తూర్ సమీపంలోని బాణసంచా ఫ్యాక్టరీలో జరిగిన పేలుడులో ఆరుగురు మృతి చెందగా.. ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.
బాణసంచా పేలుడు ధాటికి కార్మికులు ఎగిరిపడ్డారు. ఫ్యాక్టరీ సమీపంలోని ఆరు ఇళ్లు ధ్వంసమయ్యాయి. భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో చుట్టుపక్కల జనాలు అక్కడినుంచి పరుగులు తీశారు. మంటలను ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.