ప్రముఖ అణు శాస్త్రవేత్త రాజగోపాల చిదంబరం మృతిపట్ల సీఎం చంద్రబాబు సంతాపం తెలిపారు. రాజగోపాల కుటుంబ సభ్యులకు తన సానుభూతి తెలుపుతూ ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు.
‘భారతదేశ అణుశక్తి విభాగానికి నాయకత్వం వహించి.. ఆయుధ అభివృద్ధిలో రాజగోపాల చిదంబరం కీలకపాత్ర పోషించిన రాజగోపాల చిదంబరం గారి మరణం విచారకరం. దేశం నిర్వహించిన 2 అణు పరీక్షల్లో రాజగోపాల చిదంబరం పాత్ర చిరస్మరణీయం’అని రాసుకొచ్చారు.