అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ కన్నుమూసిన నేపథ్యంలో 30 రోజుల పాటు జెండాను అవనతం చేయాలని ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశించారు. ఈ నిర్ణయాన్ని కాబోయే అధ్యక్షుడు ట్రంప్ తప్పుపడుతూ పోస్ట్ పెట్టారు.
‘‘ఎవరూ ఇలా ఉండాలని అనుకోరు. ఆ నిర్ణయంపై అమెరికన్లు సంతోషంగా లేరు’’అని వ్యాఖ్యనించారు. డెమోక్రట్ల పేరు ప్రస్తావించకుండానే దేశం అంటే వారికి ప్రేమలేదని ట్రంప్ విమర్శించారు.