రాష్ట్రంలో వాలంటీర్ల పోరాటం ఉధృతమవుతోంది. కూటమి నాయకులు తమకు ఇచ్చిన మాటలను నిలబెట్టుకోవాలని వారు డిమాండ్ చేశారు. విజయవాడలో వాలంటీర్లు రోడ్డుపై వెనక్కి నడుస్తూ వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు.
తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలంటూ వాలంటీర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించే వరకూ నిరసనలు కొనసాగిస్తామని హెచ్చరించారు.