బాపట్ల జిల్లాలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి పర్యటించారు. ఈ క్రమంలోనే సంతమాగులూరు ప్రభుత్వ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభమైంది. ఆ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.
‘‘విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలనే లోకేశ్ ఈ పథకాన్ని తీసుకొచ్చారు. అలాగే ఉత్తమ ఫలితాలు సాధించే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని, ఇచ్చినమాట నిలబెట్టుకోవడమే కూటమి ప్రభుత్వ ప్రాధాన్యత’’ అని పేర్కొన్నారు.