వరల్డ్ చెస్ ఛాంపియన్ కోనేరు హంపిని శాప్ ఛైర్మన్ రవినాయుడు అభినందించారు. ప్రపంచ మహిళా చెస్ విజేత కోనేరు హంపికి శాప్ ఛైర్మన్, సిబ్బంది స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఏపీ స్పోర్ట్స్ పాలసీని హంపికి శాప్ ఛైర్మన్ వివరించారు. రాష్ట్ర క్రీడాభివృద్ధికి సూచనలు, సలహాలు ఇవ్వాలని శాప్ ఛైర్మన్ ఆకాంక్షించారు. త్వరలోనే సీఎం చంద్రబాబును కలుస్తానని కోనేరు హంపి తెలిపారు.