తూ.గో.జిల్లా కడియం మండలం వేమగిరిలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కొత్త సినిమా "గేమ్ ఛేంజర్" ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు దాదాపు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇవాళ (శనివారం) సాయంత్రం 6 గంటలకు వేమగిరి జాతీయ రహదారి పక్కన ఉన్న లేఅవుట్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రారంభం కానుంది. హైదరాబాద్‌కు చెందిన నిర్వాహకులు ఇప్పటికే అక్కడ పూర్తి ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యఅతిథిగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హీరో రామ్ చరణ్, హీరోయిన్ కియారా అద్వానీ, దర్శకుడు శంకర్, సినిమా టీమ్ వస్తుండడంతో మెగా అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు లక్ష మంది అభిమానులు తరలివచ్చే అవకాశం ఉందని అధికారుల వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ మేరకు జిల్లా యంత్రాంగం పటిష్ఠ ఏర్పాట్లు చేసింది.